6,000 కోట్ల వ్యాపారాన్ని అధిగమించింన ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు


దక్షిణ భారతదేశంలో అతి పెద్ద సహకార కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుగా అవతరించినటువంటి “ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు” తేది 30-06-2020 నాటికి 88,185 మంది సభ్యులతో రూ. 6,000 కోట్ల వ్యాపారాన్ని అధిగమించిందని సంస్ద ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి.వి నర్సింహమూర్తి తెలిపారు . ఈ రూ,6,000 కోట్లలో డిపాజిట్లు రూ. 3,680 కోట్లు గానూ, మరియు ఋణములు రూ. 2,368 కోట్లు గాను (మొత్తం రూ. 6,048 కోట్లు) వున్నవన్నారు .ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు బహుళ రాష్ట్రాల సహకార అర్బన్ బ్యాంకుగా ఉభయ తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలలో 50 బ్రాంచీలను కలిగి వుందని భారతదేశంలో గల అన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల పనితీరును వివిధ రంగాలలో పరిశీలిస్తే 18వ స్థానాన్ని కైవసం చేసుకుండదన్నారు.ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 2016లో 100సం||  లు పూర్తి చేసుకొని అతి పెద్ద మైలురాయిని అధిగమించింది. బ్యాంకు 1916 సం||లో ప్రారంభించుకున్నప్పటికీ 1983 సం|| వరకు వివిధ రకాల ఒడిదుడుకులను తట్టుకొని అభివృద్ధి బాటలోనే పయనించింది. తదుపరి  మానం ఆంజనేయులు (పూర్వ శాసనసభ్యులు)  30 సం||ల నేతృత్వంలో బ్యాంకు అభివృద్ధిపధంలో దూసుకుపోయిందన్నారు . తదుపరి ప్రస్తుత ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావు  ఆధ్వర్యంలో  మానం ఆంజనేయులు మార్గదర్శకత్వంలో అదే పంధాను కొనసాగిస్తూ బ్యాంకు నిరంతర అభివృద్ధిపధంలో, లాభాలబాటలో పయనిస్తున్నదన్నారు .ఈ విష సందర్భంలో బ్యాంకు ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావు  తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇంతటి విజయానికి పాలకవర్గ సభ్యుల తోడ్పాటు, నిరంతర కృషితోపాటు బ్యాంకు సభ్యులు, డిపాజిటర్లు, ఋణగ్రహీతలు మరియు శ్రేయోభిలాషులు అందించిన అమూల్యమైనటువంటి సహకారంతో మాత్రమే కారణమని అన్నారు. అంతేకాక అంకితభావంతో, సేవాదృక్పధంతో పని చేసే బ్యాంకు అధికారులు, సిబ్బంది కృషి ప్రజల విశ్వాసాన్ని పెంచడంతోనే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. సహకార బ్యాంకులపై దుష్ప్రచార దాడి జరుగుతున్నా, ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు తనదైన ప్రత్యేకతలతో అభివృద్ధిపధంలో దూసుకుపోవడమే నేటి నూతన ప్రస్థానంగా అభివర్ణించారు. రానున్న కాలంలో బ్యాంకు మరిన్ని నూతన సాంకేతికతలను ఉపయోగించుకుంటూ ఖాతాదారులందరికీ మరింత నాణ్యమైన సేవలను అందించడానికి ప్రయత్నిస్తామని అయన  తెలియజేశారు. ఇంతటి అభివృద్ధికి కారణమైన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు పి.వి నర్సింహమూర్తి తెలియజేశారు.